ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న యువకుడిని అరెస్టు చేసినట్లు సీఐ రోశన్ తెలిపారు. కమలాపురం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. కమలాపురం సమీపంలోని పాగేరు వంక వద్ద మధ్యాహ్నం తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సంచరించడాన్ని గమనించి అదుపులోకి తీసుకోగా ద్విచక్ర వాహనాల దొంగగా తేలిందని చెప్పారు. అతడిని ఖాజీపేట మండలం తుడమలదిన్నె గ్రామానికి చెందిన భరత్ కుమార్ గా గుర్తించారు.