మదనపల్లె రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా కె. రామచంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సీఐల బదిలీలు నియామక ఉత్తర్వులను ఇటీవల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మదనపల్లె రెండో పట్టణ సీఐగా పనిచేసిన యువరాజు బదిలీపై రాయచోటి పోలీస్ హెడ్ క్వార్టర్ కు వెళ్లారు. ఆయన స్థానంలో రామచంద్ర నియమితులై బాధ్యతలు చేపట్టారు.