మదనపల్లి మండలంలోని ఓ వివాహిత కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. కొత్తవారిపల్లి పంచాయతీ గొల్లపల్లికి చెందిన శ్రావణి అనే మహిళ కడుపునొప్పి తాళలేక.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.