ఆటోలో నాటు సారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు బుధవారం మదనపల్లి ఎక్సైజ్ సీఐ భీమలింగ తెలిపారు. పుంగనూరు నుంచి ఆటోలో నాటు సారా తరలిస్తున్నారని ముందస్తు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. సీఐ ఆదేశంతో సబ్ ఇన్స్పెక్టర్ డార్కస్ సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా నిందితుడు నజీర్ (30) సారాతో పట్టుబడ్డాడు అని తెలిపారు. 96 లీటర్ల నాటు సారా, ఆటో సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.