లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు మొలకలచెరువు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. స్థానిక బస్టాండు కూడలి వద్ద కూర్చొన్న సుమారు 53 ఏళ్ల వయసున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో అతను అక్కడికక్కడే మరణించగా.. ఎస్సై ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.