మదనపల్లె తాలూకా పోలీసులు శుక్రవారం రాత్రి పోక్సో కేసు నమోదుచేశారు. సీఐ కళా వెంకటరమణ కథనం. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక(17)ను అదే గ్రామానికి చెందిన సయ్యద్ బాషా(22) పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ అనంతరం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.