రామసముద్రం మండలం దిన్నిపల్లి సమీపంలోని అడ్డకొండలో వెలసిన శ్రీ గవితిమ్మరాయ స్వామికి శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉపవాస దీక్షలతో భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.