పుంగనూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 17న ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంగమునిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సమావేశం ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.