రామసముద్రం మండలం అరికేల పంచాయతీ దాసిరెడ్డిపల్లి సమీపంలోని తండాలో నాటుసారా తయారీ కేంద్రంపై సోమవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. సారాబట్టీని ధ్వంసం చేసి సుమారుగా మూడు వేల లీటర్ల ఊట సారాను పారవేశారు. అమ్మకానికి తయారైన యాబై లీటర్ల సారాను , సారా తయారీకి ఉపయోగించే పాత్రలు, డ్రమ్ములు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు.