రామసముద్రం మండలంకు చెందిన ఇద్దరు మహిళలు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తున్న భక్తుల బృందాన్ని తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద మదనపల్లి నుండి తిరుపతి వెళుతున్న 108 వాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో చంపాల పల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40), శేగం వారి పల్లెకు చెందిన లక్ష్మమ్మ (45) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.