చాపాడు: "ఇళ్ల స్థలాలకు కొలతలు వేసి లబ్ధిదారులకు అప్పగించాలి"

61చూసినవారు
దళితవాడల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చాపాడు తహశీల్దార్ రమాకుమారి పేర్కొన్నారు. చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సు శుక్రవారం నిర్వహించారు. దళితవాడలో సిబ్బందితో కలసి తహశీల్దారు పర్యటించారు. గ్రామంలో పట్టాలు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలకు కొలతలు వేసి లబ్ధిదారులకు అప్పగించాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్