కడప నుంచి విజయవాడ, హైదరాబాదులకు స్లీపర్ స్టార్ లైన్ బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గోపాల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలు పేర్కొన్నారు. వీటిలో ప్రయాణికులు పడుకునే విధంగా సీట్లు ఉన్నాయని, ముందస్తు ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యముందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.