కోల్ కతాలో జరిగిన పీజీ వైద్యవిద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాత్రి పీలేరులో క్రొవ్వత్తుల ర్యాలీ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ఇలాంటి దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.