భారత వ్యవసాయ పరిశోధనా మండలి, మొట్ట మొదటి కృషి విజ్ఞాన కేంద్రాలు స్ధాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరణంలో బుధవారం కలికిరి కేవీకే సమన్వయ కర్త డా"మంజుల ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 1974 వ సంవత్సరం పాండిచ్చేరిలో మొట్ట మొదటి కేవీకే స్థాపించారని అన్నారు. 50 వ ఏట అడుగిడిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు లు రైతులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.