నల్లారి ఇంట వద్ద టీడీపీ శ్రేణుల కోలాహలం

82చూసినవారు
సార్వత్రిక ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (నల్లారి కిషన్ కుమార్ రెడ్డి) భారీ విజయం సాధించడంతో కలికిరి నగిరిపల్లిలో ని ఆయన నివాసంలో బుధవారం టీడీపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. గత 25 సంవత్సరాలుగా టీడీపీ గెలవని పీలేరు నియోజకవర్గం లో తన సమీప ప్రత్యర్ధి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మొదటి సారిగా 25 వేల భారీ మెజారిటీ తో ఎంఎల్ఏ గా గెలుపొందడంతో టీడీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆయన కు అభినందనలు తెలపడానికి టిడిపి శ్రేణులు భారీ ఎత్తున తరలి వచ్చి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలను అందించి అభినందనలతో ముంచెత్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్