కన్నుల పండువగా గురుపౌర్ణమి

81చూసినవారు
కన్నుల పండువగా గురుపౌర్ణమి
ప్రొద్దుటూరు పట్టణంలో సాయిబాబా, దత్తత్రేయ స్వామి ఆలయాల్లో ఆదివారం గురుపౌర్ణమి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రధానంగా వైఎంఆర్ కాలనీ, దొరసానిపల్లె, వసంతపేట, తదితర సాయిబాబా ఆలయాల్లో విశేష పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నప్రసాద వినియోగం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్