ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో కడప, అన్నమయ్య జిల్లాల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం సమావేశం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలకు సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ట్రిపుల్ ఐటీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.