మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ గౌరవాధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 7 నెలలైనా కార్మికుల సమస్యల పరిష్కరించడంలో విఫలమైందన్నారు. సమ్మె కాలానికి వేతన బకాయిలను చెల్లించాలన్నారు.