కొండాపురం: విద్యార్థిని పరామర్శించిన ఎమ్మెల్యే
కొండాపురం గురుకుల బాలికల పాఠశాల నందు పాముకాటుకు గురై ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని మంగళవారం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టిడిపి ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి పరామర్శించి 50 వేలు ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.