పులివెందులలో రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ స్వగృహములో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు.