పులివెందుల పట్టణంలో ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మునిసిపల్ కమీషనర్ రాముడు తెలిపారు. మంగళవారం ఆయన తెలుపుతూ 21న చెన్నారెడ్డి కాలనీ, నగరిగుట్ట, 22న ప్రశాంతి నగర్, మిస్సమ్మ బంగ్లా, 23న పెద్ద కొండప్ప కాలనీ, బాకరాపురం, 24న ఉలిమెల్ల, రాజీవ్ కాలనీ సచివాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.