పులివెందుల పట్టణ పరిధిలోని మెగా లేఅవుట్ లో నిర్మిస్తున్న గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రాజా రత్నం అన్నారు. శుక్రవారం ఆయన మెగా లేఅవుట్ ను పరిశీలించారు. హౌసింగ్ డిఈ రమణారెడ్డి, డిఇసి ఏజెన్సీ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి ఫీల్డ్ ఆన్లైన్లలో ఇంటి నిర్మాణ దశలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు.