సింహాద్రిపురం మండలం దిద్దెకుంట్ల గ్రామంలో రైతు నాగేంద్ర, కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్డీవో చిన్నయ్య, అర్బన్ సీఐ నరసింహులు, ఎస్ఐ తులసి నాగప్రసాద్, తహశీల్దార్ నాగేశ్వరరావులు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. అలాగే సోమవారం రైతు ఇంటికి వెళ్లి పొలం పాస్ పుస్తకాలు, బ్యాంకు పాస్ పుస్తకాలు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు.