డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం వేంపల్లిలోని తన నివాసంలో.. కాంగ్రెస్ నేత ధ్రువ కుమార్ రెడ్డితో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు.