వేంపల్లె: రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ

56చూసినవారు
వేంపల్లె: రైతులకు పెట్టుబడి సాయం ఎక్కడ
రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 20వేలు ఎక్కడని ప్రభుత్వాన్ని సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు నిలదీశారు. గురువారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలం నెట్టుకొస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పెట్టుబడి సాయం ఎప్పుడిస్తారో ప్రకటించాలని లేనిపక్షంలో రైతుల తరపున ఉద్యమిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్