ఓబులవారిపల్లె మండలం మంగంపేట ఏపీ ఎండిసి లో పనిచేస్తున్న మహిళా కార్మికులను వేధిస్తున్న సిపిఓ, హెచ్ఆర్డీ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా సిఐటియు అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ కోరారు. ఏపీ ఎండిసి పరిపాలన భవనం వద్ద ఆయన మాట్లాడుతూ మహిళా కార్మికుల పట్ల గౌరవం లేకుండా వారు మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.