నందలూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వృద్ధులు, బాలింత మహిళలకు మంచముల కొరత ఉందని ఆసుపత్రి వైద్యులు స్థానిక సర్పంచ్ మోడపోతుల రాము ద్వారా తెలియచేశారు. గాంధీ జయంతి సందర్భంగా, నందలూరు లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 ఐరన్ మంచములు, పరుపులు, దిండ్లు అందించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కొండూరు శరత్ కుమార్ రాజు సూచన మేరకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారికీ కృతజ్ఞతలు తెలిపారు.