ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు నూతన వైద్య ఆవిష్కరణాలను అందుబాటులోకి రాష్ట ప్రభుత్వం తీసుకురావడం గొప్ప విషయమని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జి ముక్కా రూపానందరెడ్డి మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పేర్కొన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి గురువారం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుల రోగులకు వరప్రదాయని, హృదయానికి రక్ష ఆయిన ఇంజక్షన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.