పాఠశాలలో తిధి భోజనం నిర్వహణ

84చూసినవారు
పాఠశాల విద్యార్థులకు తిధి భోజనం నిర్వహించడం సంతోషంగా ఉందని మాజీ జెడ్పిటిసి చైర్మన్ ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. వారు బుధవారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లోని విద్యార్థులకు తిధి భోజనం నిర్వహించారు. ఆయా గ్రామాలలోని దాతలు ముందుకు వచ్చి పాఠశాలలకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్