కడప జిల్లా సిద్ధవటం మండల పరిధిలోని మూలపల్లె గ్రామంలో బోరింగ్ వద్ద ఉన్న ఆపరిశుభ్రతను తొలగించాలని గ్రామస్తులు గురువారం అధికారులకు విన్నవించారు. అధికారులు శుక్రవారం వెంటనే స్పందించి అపరిశుభ్రతను తొలగించి, బ్లీచింగ్ పిచికారి చేశారు. స్పందించిన అధికారులకు తెలుగుదేశం పార్టీ నేత రాజశేఖర్ యాదవ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.