కడపలో జరిగిన జిల్లా స్థాయి నెట్ బాల్, బేస్ బాల్ పోటీలలో రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం చింతరాజు పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయం సాధించారు. గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాజు మాట్లాడుతూ.. అండర్ 14, అండర్ 17 విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను, పిడి వెంకటసుబ్బయ్యను ప్రధానోపాధ్యాయులు అభినందించారు.