వైద్యులు పేదలకు నిరంతరం మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసి పంపించాలని టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు డాక్టర్లకు సూచించారు. గురువారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివిఎన్ రాజు మరియు డాక్టర్లతో సమావేశమై పలు సూచనలు సలహాలు తెలియజేశారు.