ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు రాజంపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి తెలిపారు. 21వ తేదీన కడపలో జరిగిన అండర్ 17 చదరంగం పోటీలలో పదవ తరగతి చదువుతున్న మేరువ రుత్విక్ రామ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు రుత్విక్ ను అభినందించారు.