నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ఒంటిమిట్ట మండలం మాధవరానికి చెందిన కోటపాటి సుబ్బమ్మను ఎంపిక చేసామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయవర్ధన్ తెలిపారు. వారు మంగళవారం రాజంపేటలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీలు వైసీపీ, టీడీపీ అన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాలలో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు.