రాయచోటి పట్టణంలోని సుద్దలగుట్ట నందు అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మించాలని ఆలయ కమిటీ సభ్యులు సంకల్పించారు. వారి సంకల్పానికి తోడుగా రాయచోటి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు జయరాం చిన్నారి, ప్రదీప్ 15 సంచుల సిమెంట్ బస్తాలు నిర్మాణానికి విరాళంగా ఇచ్చి భక్తిని చాటుకున్నారు. గురువారం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను అభినందించి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు.