రాయచోటిలో గురువారం జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం 150 రోజులు పూర్తి చేసుకున్న శుభతరుణంలో పలు రకాల ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అర్హులకు అందుతున్నాయో లేదో చూడాలని కోరారు. అలాగే గ్రామ స్థాయి నుండి అందర్నీ కలుపుకుని పార్టీ బలోపేతమే లక్షంగా పని చెయ్యాలన్నారు.