ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్కరూ సమస్యలతో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.