గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

69చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చిన్నమండ్యెం పరిధిలోని జల్లావాండ్ల పల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సుంకర నారాయణ (55) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు శుక్రవారం జల్లావాండ్ల పల్లికి చెందిన నారాయణ ఆవులకు గడ్డి కోసేందుకు రోడ్డు మీదకు రాగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్