ఏపీలో దీపం పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మరో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31 నుంచి ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్‌ను రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్, ఆగస్టు-నవంబర్ మధ్య రెండో సిలిండర్, డిసెంబర్-మార్చి మధ్య మూడో సిలిండర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా 2,684 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.