విశాఖలో మరో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. మధురవాడలోని కృషినగర్‌లో నివాసముంటున్న నక్క లక్ష్మి ఆమె కూతురు దివ్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లీకూతురు స్పాట్‌లోనే మరణించారు. నిందితుడు నవీన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘాతుకానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.