IPL: బెంగళూరు-గుజరాత్ మధ్య పోరు.. రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే!

59చూసినవారు
IPL: బెంగళూరు-గుజరాత్ మధ్య పోరు.. రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే!
IPL-2025లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. IPLలో ఈ రెండు జట్లు ఐదు మ్యాచులలో తలపడ్డాయి. ఈ ఐదులో RCB మూడు గెలవగా, GT రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ రెండు జట్లు చివరగా ఆడిన మ్యాచ్‌లో RCB విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో RCB 91 మ్యాచ్‌లు ఆడగా, 43 మ్యాచ్‌లు గెలిచి, 43 మ్యాచ్‌లు ఓడింది. ఒకటి టై కాగా, మరో నాలుగు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

సంబంధిత పోస్ట్