ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడం ఏర్పడవచ్చని ఐరోపాకు చెందిన వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు రాష్ట్రాల వైపు పయనిస్తుందని అంచనా. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.