పల్నాడులో మరో టెన్షన్

71చూసినవారు
పల్నాడులో మరో టెన్షన్
టీడీపీ నేతలు నేడు ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. పోలింగ్ రోజున నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాలపాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లనున్నారు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, తదితర నేతలు పాల్గొననున్నారు. అయితే మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్