అర్ధరాత్రి హైవేపై పులిని ఢీకొట్టిన కారు (Video)

1079చూసినవారు
మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై దారుణ ఘటన చోటుచేసుకుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ పులిని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులి ముందు కాళ్లు రెండు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఆ పులి బాధతో విలవిల్లాడుతూ.. వెనక కాళ్లతోనే రోడ్డుపై ఈడ్చుకుంటూ ఆ పక్కనున్న పొదల్లోకి వెళ్లి పడిపోయింది. చివరకు మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్