విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి

65చూసినవారు
విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి
కర్ణాటకలో విషాదం జరిగింది. యరగనహళ్లిలో ఒకే కుటుంబంలోని నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంట్లోని LPG సిలిండర్ నుంచి లీకైన గ్యాస్‌ను పీల్చుకోవడం వల్ల ఊపిరాడక వీరంతా మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు కుమారస్వామి (45), అతని భార్య మంజుల (39), వారి పిల్లలు అర్చన (19), స్వాతి (17)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్