కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త!

78చూసినవారు
కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త!
AP: కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా అందిస్తామని తెలిపింది. ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి.. ప్రతీ రైతుకీ రూ.20,000 చొప్పున ఇస్తామన్నారు. అలాగే భూమి లేని కౌలు రైతులకు కూడా రూ.20,000 చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. ఈ డబ్బును ఎన్ని విడతల్లో ఇస్తారనేది చెప్పలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్