AP: బడ్జెట్లో పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 469 కోట్లు కేటాయించినట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ర్యాటక రంగం చోదక యంత్రంగా మారనుందని ఆయన అన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 'పర్యాటకుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. పర్యాటక ప్రాంతాల్లో మౌలికవసతుల మెరుగుదలపై దృష్టి పెట్టాం. అఖండగోదావరి, గండికోటకు నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు' అని మంత్రి తెలిపారు.