AP: గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో ఏపీకి అప్పు తీసుకునే వీలు కూడా లేకుండా పోయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రతి శాఖలోను ఆర్థిక అరాచకం చేశారని, మన రాష్ట్రం అప్పు తీసుకోలేని స్థితికి చేరకుందని స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించిందని అన్నారు. భారతదేశంలో అప్పు తీసుకోలేని స్థితిలో ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు.