2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి : మంత్రి కేశవ్

65చూసినవారు
2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి : మంత్రి కేశవ్
AP: పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఏటా దాదాపు 2వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వీటిని రాయలసీమకు మళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం CM చంద్రబాబు పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు, వెలిగొండ, చింతలపూడి, వంశధార ఫేజ్-2 పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్