AP: తల్లికి వందనంపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. ఈ క్రమంలో శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.9,407 కోట్లను కేటాయించారు. ఒకటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విద్యార్థులకు ఇది వర్తిస్తుంది.